శిక్షణతో పరిపాలనపై మరింత పట్టు..


Ens Balu
3
Amalapuram
2021-08-04 14:24:35

శిక్షణ తరగతుల ద్వారా గ్రామ పరిపాలనపై అవగాహన పెంచుకుని గ్రామాభివృద్ధికి పాటుపడాలని జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం అమలాపురం టిటిడిసిలో4వ బ్యాచ్ సర్పంచ్ ల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జె సి సర్పంచులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించడానికి గ్రామ సర్పంచ్ లకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి పరిపాలన అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామంలో మెరుగైన పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని,  ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తమ గ్రామాలను తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ఐనవిల్లి, కాట్రేనికొన, అల్లవరం, ఐ పోలవరం మండలాల సర్పంచ్ లు,  డిఎల్పీఓ ఆర్. విక్టర్, డిఎల్డివో వి.శాంతామని, అమలాపురం ఎంపిడివో ప్రభాకరావు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు