జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
3
Gummalaxmipuram
2021-08-04 14:27:00
ఏజెన్సీలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. గ్రామాలలో జ్వరాల తీవ్రత ఉందని తెలిసినా వెంటనే బుధవారం ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ కురుపాం, గుమ్మ లక్ష్మి పురం మండలాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను పరిశీలించారు. ముందుగా గుమ్మ లక్ష్మి పురం మండలం లో టిక్కిబాయ్, కురుపాం మండలంలో తోటగుడ గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సందర్శించి గ్రామాలలో జ్వరాలకు సంబందించిన వివరాల పై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఏటువంటి అర్హత లేని వైద్యులను సంప్రదించ వద్దని, ప్రజలు తమ నివాస గృహానికి చేరువలో నున్న పి.హెచ్.సి / సి.హెచ్.సి కి వెళ్లి చికిత్స తీసుకోవాలని, కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి గుమ్మలక్ష్మిపురం మండలం పి. ఆమిటి గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు. పిర్యాదులు స్వీకరణ పరిష్కారంలో అలసత్యం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డులు పరిశీలించారు. ఈ పర్యటనలో గుమ్మాలక్ష్మిపురం, కురుపాం మండలాల రెవెన్యూ, వైద్య అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.