మౌళిక వసతుల కల్పనలో రాజీపడొద్దు..జిల్లా కలెక్టర్


Ens Balu
2
వి.మాడుగుల
2020-09-04 18:02:49

విశాఖ ఏజెన్సీలో చేపడుతున్న పాఠశాల నిర్మాణంలో మౌళిక సదుపాయాల కల్పనలో రాజీపడరాదని అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. శుక్రవారం వి. మాడుగుల మండలం డి. సురవరం గ్రామంలో నిర్మించిన నాడు – నేడు డెమో పాఠశాలను (కె.జి.బి.వి. విద్యాలయాన్ని) ఆయన పరిశీలించారు. సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించిన కాంపౌండ్ వాల్, పెయింటింగ్, మరుగుదొడ్లు, త్రాగునీరు, తదితర 9 రకాల నాడు-నేడు పనుల ను ఆయన క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు.  నిధులను సక్రమంగా వినియోగించుకున్నది లేనిది సర్వశిక్ష అభియాన్ పి.ఓ. మళ్లిఖార్జునరెడ్డిని అడిగి తెలుసుకు న్నారు.  గ్రూపు కమిటీ సభ్యులలోని ఒకరితో మాట్లాడుతూ ఇంకా ఏమైనా సౌకర్యాలకు నిధులు అవసరమని ఆయనను అడిగి తెలుసుకున్నారు.  డైనింగ్ రూం, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, తదితర వాటిని ఆయన క్షణ్ణంగా పరిశీలించి నాణ్యతలో లోపం ఉండకూడదన్నారు.  ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.