సచివాలయాల నుంచే సేవలందాలి..


Ens Balu
3
Tallarevu
2021-08-06 14:05:44

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు అమలులో గ్రామ సచివాలయం పాత్ర కీలకమని, వీటి ద్వారా మరింత వేగంగా, మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాళ్లరేవు మండలం, నీలపల్లి  గ్రామ సచివాలయాన్ని  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్  ఆకస్మికంగా సందర్శించారు.గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు,సచివాలయంలో ప్రదర్శించిన వివిధ సంక్షేమ పథకాల జాబితాను కలెక్టర్ పరిశీలించారు.కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ , సిబ్బంది, వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరును, ఇ- సర్వీసులు, పింఛన్లు, బియ్యం కార్డులు మంజూరు, వైఎస్సార్ బీమా క్లైమ్ ల వివరాలను కలెక్టర్  సిబ్బందినివివరాలు అడిగి తెలుసుకుని,క్షుణ్ణంగా రిజిస్టర్ లను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో  కోవిడ్ నిబంధనలు ప్రజలందరు తప్పనిసరిగా పాటించే విధంగా చూడాలన్నారు.గ్రామంలో అధిక వర్షాలు, వరదలు సమయాల్లో లోతట్టు ప్రాంతాల్లో పంట మునిగిపోవడంతో అనేక మంది రైతులు ఇబ్బందులకు గురిచేస్తున్న  గ్రామ కంఠం పరిధిలో ఉన్న  చెరువును సర్వే చేసి రాళ్లు వేయాలని రెవెన్యూ, సర్వే అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. తొలుత తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఉప్పంగల , జార్జి పేట, పిల్లంక ,గోవ లంక, ఇంజరం ,నీ‌లపల్లి గ్రామస్తులకు కొరకు సుమారుగా 11.66 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేసిన వైఎస్సార్ జ‌గ‌న‌న్న కాల‌నీలో జరుగుతున్న  గృహ నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. లేఅవుట్ లో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులు ,గ్రౌండింగ్ పూర్తయిన గృహాల వివరాలను ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాళ్లరేవు ఎంపీడీవో పీ.విజయ్ థామస్, పంచాయతీరాజ్ డీఇ జిబివీ. రమేష్, హౌసింగ్ ఏఈ శ్రీనివాసు ,సచివాలయ సిబ్బంది,ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు