రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం , రైతు భరోసా, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ల శాశ్వత భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన సముదాయాలను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాశ్వత భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని రోజువారి పనులలో ప్రగతి చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాళ్లరేవు మండలం ఎంపీడీవో పీ.విజయ్ థామస్,సచివాలయ సిబ్బంది, ఇతర రెవిన్యూ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.