డా.వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం ద్వారా వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు పంటల యాజమాన్యం సస్యరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వ్యవసాయాధికారి కెజెచంద్రశేఖర్ తెలియజేశారు. శనివారం శంఖవరంలోని పంటపొలాల్లో ఈ మేరకు ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఖరీఫ్ లో సీజన్ లో వచ్చే తెగుళ్లు, వాటికి చేపట్టాల్సి సస్యరక్షణ చర్యలు, మందుల వాడకంపై పలు సూచనలు చేశామన్నారు. గ్రామ సచివాలయాల పరిధిలోని రైతులకు వ్యవసాయ సహాయకులు సాగుబడి సమయంలో సూచనలు సలహాలు చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, రైతులు పాల్గొన్నారు.