అగ్రిగోల్డు బాధితులు రసీదులతో సచివాలయాలను సంప్రదించాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష కోరారు. శనివారం ఈ మేరకు శంఖవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అగ్రీగోల్డులో రూ.20వేల వరకూ డిపాజిట్లు కట్టిన వారంతా తమ రసీదులు, ఆధార్ కార్డులతో సచివాలయంలోగానీ, గ్రామ వాలంటాటీర్లను గానీ సంప్రదించాలన్నారు. కట్టిన రసీదులను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి నివేదించ నున్నామని అన్నారు. తక్షణమే వివరాలు తెలియజేయాలన్నారు. అగ్రిగోల్డు వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం ఈనెల 12వ తేదీవరకూ మాత్రమే గడువు విధించిందని ఆమె వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.