10లోగా కేజీబీవీల్లో ప్రవేశాలు పొందాలి..
Ens Balu
3
శంఖవరం
2021-08-07 14:21:23
శంఖవరం కేజీబీవీ పాఠశాలలో 37 మందికి అడ్మిషన్లు ఇచ్చినట్టు ఇన్చార్జి ఎస్ఓ రత్నం తెలియజేశారు. శంఖవరంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేజీబీవికి 6వ తరగతిలో దరఖాస్తు చేసుకున్నవారు 10వ తేదీలోగా అడ్మిషన్లు పొందాలని ఆమె కోరారు. వారితోపాటు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టినవారు వారికి వచ్చిన సెల్ మెసేజితోనూ దృవీకరణ పత్రాలతో అడ్మిషన్లు పొందవచ్చునన్నారు. ఎంపికైనా విద్యార్థులంతా ఆన్ లైన్ ధరఖాస్తు తో పాటు, కులధ్రృవీకరణపత్రం , స్టడీ సర్టిఫికేట్, ఆధార్ ,రేషన్ కార్డ్ ,పాస్ పోటో తో పాఠశాల పనివేళల్లో సంప్రదించాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్ధినిలు సద్వియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.