సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని గార్డ్స్ డైరెక్టర్ వరదా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం సీతంపేటలో గ్రంధాలయంలో సరితా చారిటబుల్ ట్రస్ట్ అధ్యర్యంలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. విజయ భారతి మాట్లాడుతూ, ప్రతి ఒక్క తల్లి తమ బిడ్డలను విద్యావంతులను చేయాలనీ తెలిపారు. సత్యభామ మాట్లాడుతూ, దిశా చట్టం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవడంతోపాటు యాప్ ని ఇనిస్టాల్ చేసుకొని రక్షణగా మలచుకోవాలన్నారు. ట్రస్ట్ చైర్మన్ సరితా మాట్లాడుతూ సమాజంలో మహిళల అభివృధ్ధికోసం తమ సంస్థ పాటుపడు తుందని తమకున్న అవసరాలు సంస్థకు తెలియచేస్తే తగువిధంగా సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ లైబ్రేరియన్ డి. రాజు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వారామణి తదితరులు పాల్గొన్నారు.