సీపీఎస్ విధానం తక్షణమే రద్దుచేయాలి..


Ens Balu
3
Anakapalle
2021-08-08 08:32:42

ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్  విధానం రద్దు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని APCPSEA రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల.నాగిరెడ్డికి వినతి  పత్రాలు అందజేసిన ఉద్యోగులు సిపీఎస్ రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, సీపీఎస్ విధానం రద్దు కోరుతూ క్విట్ సిపీఎస్ నినాదంతో  రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలని APCPSEA రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఆమేరకు అందరి ప్రజాప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందిస్తున్నామన్నారు.  అధికారంలోకి వచ్చిన వారంరోజులలోనే సీపీఎస్ రద్దు చేస్తామని  ముఖ్యమంత్రి  హామీ ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  సిపిఎస్ విధానం రద్దు చేసి పాతపెన్షన్ స్కీమును యధాతధంగా కొనసాగించి రాష్ట్రం లోని రెండు లక్షల ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని రద్దు ఛేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే రూ.10 కోట్లు ఆదాయం లభిస్తుందన్న నేతలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై విది విధానాలు రూపొందించేందు చర్చలకు తమను ఆహ్వాలవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈవిదానం రద్దు చేయకపోతే సెప్టెంబర్ 1న పెన్షన్ విధ్రోహ దినంగా పాటిస్తూ  రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు చేపడాతమని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు  బి. చిన్నారావ్ , అనకాపల్లి మండల శాఖ అధ్యక్షుడు  బి. శ్రీనివాసరావు , ప్రధాన కార్యదర్శి వి కృష్ణ మోహన్, ఎం ఎన్. జె శ్రీనివాస్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు