ప్రజలకు ఉచిత బియ్యం సక్రమంగా చేరాలి..
Ens Balu
4
Kasimkota
2021-08-08 11:36:10
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం- ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం పథకమని , లబ్ధి దారులందరికీ సక్రమంగా అందజేయాలని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కశింకోట మండలం తాళ్ళ పాలెం లో పీ డీ ఎస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రేషన్ డీలర్ ను పంపిణి వ్యవస్థ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం" పీ ఎం జి కే ఏ వై" పథకాన్ని 2020 సం ఏప్రిల్ నుండి నవంబర్ వరకూ (8)నెలలు, 2021సం మే నుండి నవంబర్ (7) నెలల వరకూ పేద ప్రజలకు ఒక్కొక్కరికీ 5 కే జీ ల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియ జేయాల్సిన అవసరం ఉందని, బియ్యాన్ని పంపిణీ చేసేటప్పుడు తప్పని సరిగా ప్రధాన మంత్రి మోదీ గారి ఫోటో ను ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు. అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన పథకం (AAY)కింద కార్డు దారులకు 35 కే జీ ల బిియ్యం,కిలో ఒక రూపాయి కు, కిలో పంచదార 13.50 రూ.లకు పంపిణి చేస్తున్నట్లు, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 60 శాతం పైగా కార్డులకు బియ్యాన్ని పూర్తి సబ్సిడీ తో రాష్ట్రాలకు అందిస్తున్నదని మంత్రి తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి పథక లబ్ది దారులతో ముఖాముఖి సంభాషించారు. "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం" అంటూ ఒకటి ఉన్నదని మీకు తెలుసా? అని ప్రశ్నించారు.. లబ్ధి దారులు మాట్లాడుతూ ప్రతీ నెల ఇంటీ వద్దకే వాహనం వచ్చి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలుపగా, ఆ విధంగా కాదు మీరు నేరుగా రేషన్ షాప్ లో ఉచిత బియ్యాన్ని ప్రధాన మంత్రి మోదీ గారి చిత్ర పటం తో తీసుకోవాలన్నారు.ప్రధాని పేదవారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి పథకాలను అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఆం.ప్ర. ఆర్థిక శాఖ ప్రిన్సిిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, ఎమ్ పీ బీ సత్యవతి, ఎమ్ ఎల్ సి పి వి యన్ మాధవ్, సోము వీర్రాజు,ఎం ఎల్ ఏ లు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, జాయింట్ కలెక్టర్ లు ఏం వేణుగోపాల్రెడ్డి,పి అరుణ్ బాబు, అర్ డీ వో సీతా రామారావు, అధిక సంఖ్య లో స్థానిక ప్రజలు హాజరయ్యారు.