రోడ్డు తవ్విన ధనరెడ్డిపై పోలీసులకి ఫిర్యాదు..


Ens Balu
5
S Rayavaram
2021-08-08 14:58:11

ఎస్.రాయవరం లోని వెంకటేశ్వరస్వామి గుడి వద్ద లేఔట్ నుంచి వ్యర్దపు నీరు సర్వసిద్ది పంట కాలువ లోకి వదలడానికి ఆదివారం అర్ధరాత్రి తారురోడ్డు ధ్వంసం చేసి సిమెంట్ తూరలు వేసిన కర్రిధనరెడ్డి పై ఆర్అండ్ బి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.  సర్వసిద్ది పంట కాలువలోకి అక్రమ లేఔట్ వ్యర్దపు నీరు పంపడానికి నిబంధనలకు విరుద్ధంగా అర్అండ్ బి, నీటిపారుదలశాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీల వద్ద ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా తారురోడ్డు  తవ్వేశారు.  పట్టపగలు 10 గంటల సమయంలో అందరూ వాహనదారులు, అధికారులు వెళుతుండగా రద్దీగా ఉన్న సమయంలో తారు రోడ్డు రెండు అడుగులు వెడల్పు, 30 అడుగుల పొడవునా తవ్వేసిన విషయమై ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు తహసీల్దార్ బి.సత్యనారాయణకు తెలియజేశారు. తక్షణమే యజమాని కర్రి ధనరెడ్డి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని  సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహశీల్దార్ బి.సత్యనారాయణ చేపడుతున్న పనులు ఆపాలని ఆదేశించారు. ఇదే విషయమై ఆర్అండ్ బీ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నిఫిర్యాదులు చేసినా రాత్రికి రాత్రి మళ్లీ రోడ్డును అడ్డంగా తవ్వేసి బైపా శ్రీనివాసరావు మరో 5 గురు వ్యక్తులతో రోడ్డు యంత్రాలతో పనులు పూర్తిచేశారు. ఇటు పోలీసులు, ఆర్అండ్భీ, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేరసినా పనులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించారని ఆర్టీఐ కన్వీనర్ ఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా అక్రమాలు, ఆక్రమణలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోతే విషయాన్ని ఆధారాలతోపాటు జిల్లా ఎస్పీ, జిల్లాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు కన్వీనర్ ఆదివారం మీడియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 
సిఫార్సు