జగనన్న స్వచ్ఛ సంకల్పంతో సుందర గ్రామాలు..
Ens Balu
3
Sankhavaram
2021-08-09 14:03:14
జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారిపోయి సుందర గ్రామాలుగా తయారు కావాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని శ్రీ సత్యదేవ కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ గ్రామాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా మార్చాలని సంకల్పించారని అన్నారు. ఇందులో బాగంగా అన్ని పంచాయతీలు, గ్రామ సచివాలయాల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుని స్వీకరించి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలన్నారు. కార్యక్రమం ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలపుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, తహశీల్దార్ బాలసుబ్రమణ్యం, ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు, మండలంలోని 14 పంచాయతీల సర్పంచ్ లు, స్థానిక సచివాలయ కార్యర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల సతీష్, పడాల బాష, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.