శంఖవరంలో ఆరోగ్యసిబ్బంది మంగళవారం దోమలపై దండయాత్ర మొదలు పెట్టారు. నీటి నిల్వ కుంటలు, పాత్రలు, నీళ్ళ తొట్టెలు, నీరు నిల్వ ఉన్న టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర వస్తు సామాగ్రిలో దాగి ఉన్న దోమలపై వాటి నివారణకు వివిధ రకాల మందులను పిచికారీ చేసారు. వీటికి సమాంతరంగా మరో పక్క జ్వరాలు, డెంగ్యూ జ్వర పీడితుల ఆచూకీ కనుగొనేందుకు పక్కాగా సర్వే చేపట్టారు. శంఖవరంలోని అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వ ఆస్పత్రి క్షేత్ర స్థాయి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామం మొత్తం మీద 8 వరకూ డెంగ్యూ జ్వరాలు ఉన్నట్టు మిగతా వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నట్టు ఆస్పత్రి ప్రధాన వైద్యుడు ఆర్వీవీవీ. సత్యనారాయణకు సమాచారం అందడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మూడు డెంగ్యూ జ్వారాలు నమోదైన అంబేద్కర్ నగర్ పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ప్రాంతం మొత్తాన్ని నిరవధికంగా మూడు రోజుల పాటు సర్వే చేయాలని, దోమల నివారణా మందులను పిచికారీ చేయాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ యు.గ్లోరీ, సచివాలయం 1 ఏఎన్ఎం. వెంకటలక్ష్మి, ఆశ కార్యకర్తలు కోగూరి నాగమణి, జక్కల సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.