రేవిడి పీహెచ్సీని ప్రారంభించిన మంత్రి..


Ens Balu
4
రేవిడి
2021-08-10 16:24:36

భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  పద్మనాభం మండలం రేవిడిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు పనుల్లో భాగంగా రూ.69 లక్షల వ్యయంతో పనులు చేపట్టగా.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం.. రూ.37 లక్లల వరకు పనులు పూర్తయ్యాయని  అధికారులు వివరించారు. ఆసుపత్రి పనులకు సంబంధించి ఆర్ అండ్ బీ అధికారుల పనితీరు మరింత మెరుగు పరచుకోవాలని మంత్రి ఆదేశించారు.  పీహెచ్ సీకి సబంధించి మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని డీఎమ్ హెచ్ఓను ఆదేశించారు. ఈక్రమంలో ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. స్టాఫ్ అందుబాటులో ఉండటం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా  పూర్తిస్థాయిలో స్టాఫ్ నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో బెడ్లు, మందులు, మంచినీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి బంధువులు వేచి ఉండేందుకు ఒక షెడ్డు నిర్మించాలని ఆదేశించారు. ఆసుపత్రి పనులపై రిపోర్ట్ ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి మంత్రి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య, రెవెన్యూ అధికారులు, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సిఫార్సు