ఈకేవైసీ గ్రామ వాలంటీర్లే చేయించాలి..
Ens Balu
5
Parvathipuram
2021-08-12 13:59:37
గ్రామ వలేంటిర్లు తమ పరిధిలో గల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించే లా విధులు నిర్వహించాలి అని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ గురువారం తన పర్యటనలో భాగంగా గరుగుబిల్లి,పార్వతీపురం మండలాలు పర్యటించారు. గరుగుబిల్లి మండలంలో గొట్టివలస, ఉల్లిభధ్ర, గరుగుబిల్లి, పార్వతీపురం మండలం అడ్డాపుసీల సచివాలయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా వాలంటీర్లు తో రైస్ కార్డుల ఇ.కె.వై.సి పై సమీక్షించారు. ఇ.కె.వై.సి ఏంతవరకు జరిగింది అన్న వివరాలపై ఆరాతీశారు. అనంతరం రైస్ కార్డుల ఇ.కె.వై.సి ఇంతవరకు కాని వారికి నోటీసు ద్వారా తెలియజేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయం సిబ్బంది, వాలెంటిర్లకు సీజనల్ వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు. పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. అనంతరం పార్వతీపురం మండలం పార్వతీపురం సచివాలయాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.