శంఖవరంలో 131 అగ్రీగోల్డు పత్రాలు ఆన్లైన్..
Ens Balu
4
Sankhavaram
2021-08-12 15:55:21
శంఖవరం మండల కేంద్రంలో అగ్రీగోల్డు బాధితుల నుంచి రూ.20వేల లోపు డిపాజిట్ దారుల అర్జీలు 131వచ్చినట్టు మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష తెలియజేశారు. గురువారం శంఖవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ మూడు గ్రామ సచివాలయాల పరిధిలో అందిన డిపాజిట్ అర్జీలను ఆన్ లైన్ చేశామన్నారు. మరో 20వరకూ గతంలో పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన వారు తెచ్చినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డు సక్రమంగా ఉన్నవాటినే ఆన్లైన్ చేశామన్నారు. కొని ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేని డాక్యుమెంట్లను స్వీకించలేదని చెప్పారు.