విశాఖ మన్యంలో ముగ్గురు మావోయిస్టులు అరెస్టు..


Ens Balu
2
Chinthapally
2020-09-05 13:41:23

విశాఖరూరల్ జిల్లా పోలీసులు మావోయిస్టుల ఏరివేతలో పురోగతి సాధిస్తున్నారు. అంతేకాదు దళంలో ఉన్న సభ్యులను, ప్రాంతాల నాయకులను లొంగిపోవాలని సూచన చేస్తున్నారు. ఈ తరుణంలోనే జిల్లాలోనే చింతపల్లి మండలం అన్నవరం పోలీసులు  మావోయిస్టు పార్టీకి చెందిన బోనంగి నాగేశ్వరరావు(34), గడుతూరి రామచంద్ర పడాల్ (35), సింద్రి అప్పారావు(31)‌ను అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్​కు తరలించామని చింతపల్లి, పాడేరు సీఐలు శ్రీను, పైడపు నాయుడు తెలిపారు. పలు కేసుల్లో వీరు ప్రధాన నిందితులని సీఐ శ్రీను తెలిపారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులపై ఎటువంటి కేసులు నమోదు చేయమన్న పోలీసులు అలాంటి  మావోయిస్టులకు పునరావాసం ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని సీఐలు శ్రీను, పైడపునాయుడు తెలిపారు. మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోతున్నారంటూ మీడితో ప్రచారం జరుగుతున్న తరుణంలో మావోయిస్టుల అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అంతేకాదు విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులను పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది...