మహానీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం..
Ens Balu
2
Sankhavaram
2021-08-15 13:47:16
అల్లూరి సీతారామరాజు స్వయంగా సంచరించిన శంఖవరం మండల కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం గ్రామసచివాలయం-1లో గ్రామసర్పంచ్ బి. గన్నయ్యమ్మ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్ మాట్లాడుతూ, మహాత్ముల ప్రాణ త్యాగాల ఫలితమే నేడు 75ఏళ్లుగా స్వాతంత్య్రం ఫలితాలను అనుభవిస్తున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు సైతం భరతజాతి కోసం ప్రాణాలర్పించారన్నారు. వారి ఆశయాలకు అనుగుణం పనిచేసిన రోజే స్వాంతంత్ర్యానికి నిజమైన గుర్తింపు వచ్చిన్టు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు రాంబాబు, శమకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.