కత్తిపూడి సుబ్రమణ్య స్వామి ఆలయ ఆవరణలో వున్న వేణుమాధవ స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారి ఆలయంలో ఈరోజు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అస్టోత్తరాలను ఆలయ అర్చకులు సత్యన్నారాయణ శర్మ చేపట్టారు. ఈ సందర్భగా వేణఉమాధవ స్వామిని అన్ని రంగుల పూలు, తులసి మాలలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వి.నూకరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక భజనా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.