మహాత్ముల బలిదానమే నేటి మన స్వాతంత్య్రం..-


Ens Balu
3
Sankhavaram
2021-08-15 16:02:23

భారత స్వాతంత్ర్యం కోసం మహాత్ముల ప్రాణాల బలి దానం/ త్యాగ ఫలమే మన స్వాతంత్ర్య ఫలాలుగా అందుకుంటున్నామని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం శంఖవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, కళాశాలల ప్రాంగణాల్లో ఎంతో ఘనంగా నిర్వహించిన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టాడుతూ, ఆ జాతి నేతలు ఎప్పటికీ మనకు చిరస్మరణీయులని, వారి శాంతియుత, విప్లవ ద్విముఖ పంధా పోరాటాల ఫలితంగానే నేటికి 75 స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించు కుంటున్నామన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ఆయన తన విలువైన సందేశాన్ని అందించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల ఉన్నతి కోసమే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్, నాడు - నేడు, జగనన్న విద్యా కానుక వంటి పథకాలను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టారని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్ధులు ఉన్నత స్థాయికి రావాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు.  ఈ నెల 18 తేదీన పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రెండో దఫా నాడు - నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నా మన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలనం చేసి, పూల మాలలతో ఆవిష్కరించి, ఆ నేతలకు నివాళులను అర్పించారు.  ఈ కార్యక్రంలో పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు