కేంద్ర అటవీశాఖ పరిశీలనా పర్యటన..
Ens Balu
3
Nathavaram
2021-08-18 14:29:28
విశాఖజిల్లాలోని నాతవరం మండలం భమిడికలొద్దు గ్రామంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటి బుధవారం పర్యటించింది. ఆ ప్రాంతంలో లేటరైట్ మైనింగ్ గనులకు సంబందించి జాతీయ హరిత ట్రిభ్యునల్ ఆదేశాల మేరకు కమిటి వివరాలు సేకరించింది. అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఎల్లమురుగన్, సైంటిస్టు సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున , జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, ఆర్ డి ఓ అనిత, తాసిల్దార్ జానకమ్మ, గనుల శాఖ డి డి సూర్యచంద్ర, డి ఎఫ్ ఓ సూర్యనారాయణ, సర్వే ల్యాండ్ రికార్డ్సు ఎ డి కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ ప్రమోద్ కుమార్ రెడ్డి, రూరల్ సి ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.