భూముల రీ సర్వేకి ప్రజలు సహకరించాలి..
Ens Balu
4
Pachipenta
2021-08-18 15:07:47
భూముల సర్వేకు అందరూ సహకరించాలని పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ కోరారు. బుధవారం పాచిపెంట మండలం గుట్టుర్టు పంచాయతీ కుడుమురులో ప్రోజెక్ట్ అధికారి గ్రామసభ నిర్వహించారు. కుడుమురు గ్రామం సర్వే నేం 48కు సంబంధించి ఒరిజినల్ రికార్డులు లేనందున సర్వేకు సహకరించమని కోరుతూ గ్రామ సభ నిర్వహించారు. సాగుచేస్తున్న వారి వివరాలు నమోదు చేయమని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎవరైతే మేము ఈ భూమి ఇనాము దారులు అంటున్నారో వారి దగ్గర వివరాలు తీసుకొని మళ్ళీ సభ ఏర్పాటు చేసి నివేదికలు తయారు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. అన్సేటిల్డ్ లాండ్ కాబట్టి పాత రికార్డులు ఒక్క సారి పరిశీలించాను తహశీల్దారుకు సూచించారు. ఈ గ్రామ సభకు పాచిపెంట తహసిల్దార్ రామ చంద్ర రెడ్డి, ఎం.పి.డి.ఓ, డి.టి రెవెన్యూ అధికారులు సిబ్బంది, గ్రామ సర్పంచ్ మదల సింహాచలం గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.