తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 21న గ్రుహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు రాజానగరం మండలో పర్యటించనున్నారని రాజమండ్రి హౌసింగ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తోపాటు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు నరేంద్రపురం గ్రామంలో వైఎస్సార్ జగనన్న కాలనీలను సందర్శిస్తారని, అక్కడే పలు అభివ్రుద్ది కార్యక్రమాలకు, ఇళ్ల నిర్మాణాలకు శంఖుస్థాపనలు కూడా చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.