సచివాలయం నుంచే సేవలన్నీ అందాలి..
Ens Balu
3
Annavaram
2021-08-21 14:27:28
గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందాలని జాయింట్ కలెక్టర్ డా.లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. శనివారం అన్నవరం గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా జెసీ మాట్లాడుతూ, సిబ్బంది నూరుశాతం బయోమెట్రిక్ వేయాలని, సాంకేతిక సమస్యలొస్తే కారణాలను తెలియజేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సచివాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యంగా సర్వీస్ రిక్వెస్టులపై పై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. కచ్చితంగా ప్రతిరోజూ మూడు నుంచి ఐదు వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని జేఏసీ సిబ్బందిని ఆదేశించారు.ఈకార్యక్రమంలో ఎంపిడిఓ రాంబాబు తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి శ్రారామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.