విశాఖలోని సింహాచలంలో సామాజిక కార్యకర్త విజినిగిరి.బాలభానుమూర్తి వ్రుద్ధులకు గొడుగులు వితరణ చేశారు. ఈ మేరకు సోమవారం 98వ వార్డ్ పరిధి విజినిగిరిపాలెం గ్రామంలో ఈ సేవాకార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం వర్షాలు, ఎండలకాస్తున్న సందర్భంగా దృష్టిలో ఉంచుకొని నిరుపేద వృద్ధులకు ఉపయోగపడాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. తన తండ్రి వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం తమ కుటుంబ సభ్యులు ఒక సేవా కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుంద చెప్పారు. అందులో భాగంగానే తండ్రి విజినిగిరి.అప్పారావు ఐదవ వర్థంతిని పురుస్కరించుకొని వ్రుద్ధులకు గొడుగులు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజినిగిరి.సత్యసురేంధ్ర తదితరులు పాల్గొన్నారు.