పశుసంవర్ధక శాఖలోని సహాయకులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించు కోవాల్సిన అవసరం వుందని ఆ శాఖ సహాయ సంచాలకులు డా.ఎం.వీరరాజు సూచించారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలో ఆసుపత్రి వేదికగా తన పరిధిలోకి వచ్చే గ్రామసచివాలయ వెటర్నీ సహాయకుల వారంతపు నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీక్లీ స్కిల్ అసెస్ మెంట్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. పశుసంవర్ధక శాఖ నిర్దేశించిన లక్ష్యాలతోపాటు, కొత్త విధానాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు, ఎలా పాడి రైతల పశువులకు సేవలందిస్తున్నారో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.