ప్రజలంతా మెచ్చేలా సేవలు అందించాలి..
Ens Balu
8
Sankhavaram
2021-08-23 10:46:04
ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించాలని డిఎల్పీఓ వై.అమ్మాజీ పేర్కొన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం-1ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలందరూ మెచ్చేలా సేవలందించాలన్నారు. అనంతరం సిబ్బంది అందించే సేవల వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో నోటీసు బోర్డులో ప్రదర్శించిన ఆయా ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితాలను పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. కార్యదర్శి రాంబాబు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్ తదితరులు ఉన్నారు.