కత్తిపూడిలో 50మందికి ఉచిత వైద్య పరీక్షలు..


Ens Balu
4
Kathipudi
2021-08-23 11:14:30

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 104 ప్రత్యేక  వైద్య శిబిరాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ కోరారు. సోమవారం కత్తిపూడిలోని సచివాలయం-1 లో 104 ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సర్పంచ్ కొల్లు వెంకటసత్యనారాయణ ప్రారంభించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 50 మంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీచేశారు. ప్రజలకు తగు ఆరోగ్య సూచనలు, ఆహారం నియమాలనూ వైద్యాధికారి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కత్తిపూడి గ్రామ పంచాయతీలో ఉన్న మూడు సచివాలయాల్లోనూ ప్రతీ నెలా మొత్తం మూడు రోజుల పాటు మూడు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం  సచివాలయం 2 లోను, బుధవారం సచివాలయం 3 లోనూ ఈ 104 ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో తుని డివిజనల్ మేనేజర్ కేంద్రం.వీరబాబు, తొండంగి మండలం రావికంపాడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పరిధిలోలోకి వచ్చే కత్తిపూడి సచివాలయం 1 ఏఎన్ఎం.నాగమణి, సచివాలయం 2 ఏఎన్ఎం.బేబీసునీత, కత్తిపూడి సచివాలయం-1 సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు