యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు జరగాలి..


Ens Balu
5
Sankhavaram
2021-08-24 11:32:21

గ్రామ సచివాలయలు, వెల్నెస్ సెంటర్లు, ఆర్బీకే  భవనాల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని పంచాయతీరాజ్ డిఇ వెంకటేశ్వర్లు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం శంఖవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఈ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్నిరకాల నిర్మాణాలు పూర్తికావాలన్నారు. ఆర్ బికె, వెల్నెస్ సెంటరర్లు, సచివాలయాల నిర్మాణాలు వేగం పెంచాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డిఈ ఆదేశించారు. ఇప్పటివరకూ నిర్మాణంలో ఉన్న, త్వరలో పూర్తికాబోతున్న నిర్మాణాల వివరాల నివేదకలను సచివాలయాల వారీగా పంపాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
సిఫార్సు