బ్రిడ్జి సపోర్టింగ్ వాల్ కొట్టుకుపోయింది..


Ens Balu
5
Annavaram
2021-08-24 11:35:29

అన్నవరం-మండపం మార్గమధ్యలో వున్న బ్రిడ్జి సోపోర్టింగ్ వాల్ ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకు పోయింది. దీనితో ఈ ప్రాంతంలో ఉన్న మొట్టి మొట్టి మొత్తం వర్షపు నీటికి కరిగిపోయి గొయ్యలా మారింది. ఈ బాగాన్ని ఆనుకునే ద్విచక్రవాహనాలు బ్రిడ్జిపైగా టర్నింగ్ కొట్టాల్సి వుంది. ఈ ప్రాంతం కాస్త భయంకరంగా మారడంలో ఎక్కడ ఆ గొయ్యి నుంచి జారిపోతామేమోననే భయంతో వాహనచోదకు దానిని పక్కనుంచి వెళ్లాల్సి వస్తుంది. ఆదమరుపుగా వచ్చేవారు ఖచ్చితంగా ఆ గొయ్యిలో పడే ప్రమాదముండటంతో ఎవరూ కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. రెండూ పంచాయతీలకు మధ్యన ఉండటంతో ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని రెండు పంచాయతీల వారు చేతులెత్తేస్తున్నారు. అధికారులు ద్రుష్టిసారిస్తే తప్పా ఈ సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు కనిపించడం లేదు..
సిఫార్సు