పెండింగ్ లో అర్జీలు ఉండకూడదు..
Ens Balu
5
Adivarampeta
2021-08-25 13:27:14
స్పందన అర్జీలు పెండింగ్ లో ఉండరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక ఆదివారంపేట సచివాలయం -2ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసే డిసిప్లే బోర్డు సచివాలయానికి వచ్చే ప్రజలకు సరిగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని కమీషనర్ ను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంత వరకు లబ్దిదారులకు ఇచ్చిన వాటికి అకనాలెడ్జ్ ఉన్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. వాటిని ఏ విధంగా చేస్తున్నదీ, సెల్ ఫోన్ లో పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, ప్రతీ రోజు సరఫరా చేస్తున్న తాగునీరు ఎవరు చూస్తున్నదీ, నీరు సరఫరా చేసే వారి ఫోన్ నంబర్ ఉన్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. కమీషనర్ ఫోన్ నంబర్ పెట్టుకోవాలని చెప్పారు. వీధిలో లైట్లు ఎన్ని ఉన్నాయని అడుగగా 80 లైట్లు ఉన్నాయని సచివాలయ సిబ్బంది తెలిపారు. అందులో ఎన్ని పనిచేస్తున్నాయని కలెక్టర్ అడుగగా కొన్ని పనిచేయడం లేదని చెప్పగా పనిచేయడం లేదని కమీషనర్ దృష్టిలో పెట్టాలని ఆదేశించారు. మెటీరియల్ దిగుమతి చేసుకొని సిద్దంగా ఉంచుకోవాలని కమీషనర్ ను ఆదేశించారు. స్పందన అర్జీలు 199 పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రోపర్టీ ట్యాక్స్ ఎప్పుడైనా ఇవ్వగలరా అని కలెక్టర్ అడుగగా ఎప్పుడైనా ఇస్తామని సచివాలయ సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. ఇంత వరకు ఎంత నగదు జమచేసింది కంప్యూటర్ లో ఆయన పరిశీలించారు. సిబ్బంది హాజరును ఆయన పరిశీలించారు. సచివాలయంలో మార్పులకు పలు సూచనలు కమీనర్ కు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఓబులేసు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.