మధ్యాహ్నాం భోజనాల్లో నాణ్యత పాటించాలి..
Ens Balu
5
శంఖవరం
2021-08-25 15:59:57
పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నా భోజన పథకంలో పూర్తిస్థాయి నాణ్యత పాటించాలని గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకులు బడేదివాకర్ పేర్కొన్నారు. బుధవారం శంకవరం మోడల్ స్కూల్ లో ఆయన మధ్యాహ్న భోజన పథకంలో ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చుతో భోజనాన్ని అందిస్తుందని దీని నిర్వాహకులు శుభ్రత, రుచితో తయారుచేసి విద్యార్ధులకు అందించాలన్నారు. అనంతరం ఆహార పదార్థాలను రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే నాణ్యత రుచితో నిత్యం విద్యార్ధులకు ఆహార పదార్ధాలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల భోజన తయారీ సిబ్బంది పాల్గొన్నారు.