బిఎల్వో విధులు సిబ్బంది నిర్వహించాల్సిందే..
Ens Balu
20
Sankhavaram
2021-08-25 16:12:56
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్వోలు ఖచ్చితంగా విధులు నిర్వహించా ల్సిందేనని తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం శంఖవరం ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్వోలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా గరుడా యాప్ ఇన్స్టాల్ ఓటరు నమోదుతో పాటు అన్ని కార్యక్రమాలన్నీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశం వచ్చినా వాటిని కచ్చితంగా అమలుచేయాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం బిఎల్వోలను బూత్ ల వారీగా రాబోయే కార్యక్రమాలకు సిద్ధం చేయడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని మండల స్థాయిలో పెట్టిన గ్రూపుల్లో సమాచారం పెడుతున్నామని వాటికి అనుగుణంగా బిఎల్వోలంతా విధులు నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కూడా అదే స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఎల్వో విధులకు ఎంపికైన మహిళా పోలీసులు, వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.