పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ చేయాలి..
Ens Balu
4
Sankhavaram
2021-08-25 16:16:29
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పారిశుద్ధ్య నిర్వహణ తరచూ చేపట్టాలని ఎంఈఓ ఎస్విరమణ పేర్కొన్నారు. బుధవారం శంఖవరంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం అందించిన పారిశుధ్య నిర్వహణ సామాగ్రిని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ప్రభుత్వం నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినదని వాటి నిర్వహణకే వీటిని సరఫర చేసిందన్నారు. వీటిని మరుగుదొడ్లు పరిశుభ్రం చేసించే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. అన్ని పాశాలలకు సమాచారం అందించామని రెండుమూడు రోజుల్లో వీటి పంపిణీ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.