డెంగ్యూజ్వరాల నియంత్రకు శ్రమించాలి..


Ens Balu
4
శంఖవరం
2021-08-27 12:44:25

శంఖవరం మండల కేంద్రంలోని డెంగ్యూ జ్వరాల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, గ్రామసచివాలయ సిబ్బంది సమన్వయంగా పనిచేసి ఫలితాలు సాధించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పి.సరిత సూచించారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలో ఆమె విస్త్రుతంగా పర్యటించి డెంగ్యూ జర్వాలు, పారిశుధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్య సిబ్బంది తరచుగా ప్రైరాత్రమ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతోపాటు, లక్షణాలున్నవారికి తక్షణమే వైద్య పరీక్షలు చేయించాలన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయితే సదరు ఇళ్ల వద్ద ప్రత్యేకంగ బ్లీచింగ్ చైన్ ఏర్పాటు చేయాలని గ్రామసచివాలయ కార్యదర్యదర్శి శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు. అనంతరం వ్యాధుల పరిస్థితిపై పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణతోపాటు, పారామెడికల్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవకాశం ఉంటే వారంలో రెండు రోజులు  ఫీవర్ సీజన్ వెళ్లేంత వరకూ డ్రే పాటించేలా చూడాలని, మంచినీటికి తప్పని సరిగా క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి బందిలి గన్నియ్యమ్మ, ఆసుపత్రి ఫీల్డు సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు