వివేకానంద సంస్థకు దేశీయ గోమాత వితరణ..


Ens Balu
5
Visakhapatnam
2021-08-28 07:18:43

విశాఖ పాత నగరంలో ఉన్న శ్రీ వివేకానంద  వృద్ధుల, అనాధ ఆశ్రమం కు సింహాచలం అప్పన్న దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు శనివారం దేశీయ గోమాతను అందచేశారు. ఈ సందర్భంగా తొలుత గోమాతకు శ్రీనుబాబు, సంస్థ సభ్యులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు,కుంకుమ సమర్పించిన అనంతరం మహిళలు మంగళ హారతిలు ఇచ్చారు అనంతరం ఈ ఆశ్రమానికి గోమాత ను అందజేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, ఈ అనాధ,వృద్ధుల ఆశ్రమానికి ప్రస్తుతం పాలు, పెరుగు కొరత తీవ్రంగా ఉందని, దీంతో ఈ గోమాత ద్వారా ఆ అవసరాలు తీర్చడానికి వెసులుబాటు కలుగుతుందన్నారు, ఇకమీదట పాలు.పెరుగుకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇక ఆశ్రమం లో 30 నుంచి మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు  చెప్పారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు, సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ గోమాత వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అందులో ప్రత్యేకంగా దేశవాలి గోమాతను పెంచాలనే ఉద్దేశం తోనే ఈ కార్యక్రమాన్ని సంకల్పించామన్నారు.అందుకు సహకరించిన శ్రీనుబాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కృష్ణాష్టమి వేడుకలు కూడా సభ్యులు అందరూ జయప్రదం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సోంబాబు,అప్పలకొండ, భానోజిరావు,సభ్యులు  పాల్గొన్నారు.
సిఫార్సు