కరోనా కట్టడికి వెక్షినేషన్ తప్పనిసరి, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలి, వెక్షినేషన్ పై అపోహలు విడండి అని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా పార్వతీపురం డివిజన్ లో కురుపాం మండలం గుమ్మ,పి. లేవిడి, జి.ఎల్.పురం మండలం కెడారిపురం, తాడికొండ గ్రామాలలో శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో నిర్దేశిత గ్రామ పంచాయతీలలో 18 సంవత్సరాల వయస్సు పై బడి ఉన్న వారికి వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉదయం ప్రారంభించారు. గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న వెక్షినేషన్ కార్యక్రమానికి ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పర్యవేక్షించి, నిర్వహిస్తున్న వెక్షినేషన్ పై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలని, వెక్షినేషన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి, అపోహలు వీడి వెక్షినేషన్ చేయించుకొని కరోనా కట్టడికి అందరూ సహకరించాలన్నారు. ఈ పర్యటనలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.