కోవిడ్ వేక్సినేషన్ పై అపోహలు వీడండి..
Ens Balu
3
Bobbili
2021-08-28 10:24:11
కరోనా కట్టడికి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా బొబ్బిలి మునిసిపాలిటీ కళాభారతి ఆడిటోరియంలో శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు పై బడి ఉన్న వారికి వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉదయం ప్రారంభించారు. ఈ స్పెషల్ డ్రైవ్ వెక్షినేషన్ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ పర్యవేక్షించి, నిర్వహిస్తున్న వెక్షినేషన్ పై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెక్షినేషన్ పై అపోహలు వీడీ ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలన్నారు. వెక్షినేషన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి, అపోహలు వీడి వెక్షినేషన్ చేయించుకొని కరోనా కట్టడికి అందరూ సహకరించాలన్నారు. ఈ పర్యటనలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.