2023 నాటికి నిర్మాణాలు పూర్తికావాలి..


Ens Balu
5
Paderu
2021-08-28 10:27:49

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఏడు బ్లాకుల 2023 నాటికి  పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మరియు మౌళిక వసతుల కల్పన వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి.మరళీ కృష్ణ ఐఎఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎపిఎమ్ డిఎమ్ సి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500కోట్ల రూ.తో నిర్మిస్తున్న వైద్య కళాశాల త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ముందుగా విద్యుత్ లైన్లు  , సెట్టింగ్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆపనులు రెవెన్యూ సహకారంతో చెయ్యాలని అన్నారు. అలాగే కాంపౌండ్ గోడ నిర్మాణం త్వరిత గతిన చేపట్టాలని రెవెన్యూ పరస్పర సహకారంతో పనులు పూర్తి చేయాలని అన్నారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రికి స్థలం అడ్డంకులు లేకుండా చూసి  త్వరితగతిన  ఆసుపత్రి (సిహెచ్ సి)
పనులు చేపట్టాలని  అన్నారు. ఈ ఆసుపత్రి పనులు ప్రాజెక్టు అధికారి మరియు సబ్ కలెక్టర్ వారి సహకారం తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని ఆయన అన్నారు. అంతకుముందు ఎమ్డి ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోణంకి, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తో కలసి మెడికల్ కళాశాల నిర్మాణం పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్త వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్  ఎపిఎమ్ డిఐసి శివకుమార్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ అచ్చెన్నాయుడు , పాడేరు తహశీల్దార్ ప్రకాశ్ రావ్  తదిత రులు  పాల్గొన్నారు.
సిఫార్సు