రూడకోట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈనెల 31న నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య సేవలు పొందాలని ఐటీడీఏ ప్రొజెక్టు అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ ఆరోగ్యశ్రీ ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రత్యేక కంటి వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్యులు,, ఎముకల వైద్యులు, గుండె సంబంధిత సమస్యల వైద్యులు, చర్మవ్యాధుల వైద్యులు ఇతరత్ర వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక వైద్యులు పాల్గొని చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు అందించబడునని, శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి జిల్లా ఆసుపత్రులకు తరలించి ఉచితంగా శస్త్ర చికిత్సలు జరిపించి మెరుగైన వైద్యం అందించబడునని తెలిపారు. కావున ఈ శిబిరానికి పైన తెలిపిన రోగులతోపాటు దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్న రోగులు తరలివచ్చి వైద్య సేవలు పొందాలని తెలియజేసారు. రోగులు తప్పని సరిగా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రావాలని తెలియజేశారు.