పంచాయతీ రికార్డులన్నీ నిర్వహించాలి..


Ens Balu
14
Rowthulapudi
2021-08-30 10:47:35

గ్రామ పంచాయతీలు, గ్రామసచివాలయాల్లో ప్రభుత్వ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీఓ ఎస్వీనాయుడు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రౌతులపూడి గ్రామపంచాయతీలో రికార్డులను ఈ మేరకు ఆయన తనిఖీలు చేశారు. కొత్తగా పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పాటైనందున ఏ కార్యక్రమమైనా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రికార్డుల నిర్వహణలో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సచివాలయాల్లోని సిబ్బంది కూడా ప్రభుత్వం నిర్దేశించిన రికార్డులు అన్నిశాఖల సిబ్బంది నిర్వహించాలన్నారు. కొన్నిచోట్ల గ్రేడ్-1,4 కార్యదర్శిలు రికార్డులు నిర్వహించడానికి మినహాయింపు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రతీ ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా రికార్డులు నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు