మాగ్రామంలో ప్రభుత్వ బ్రాందిషాప్ పెట్టొద్దు..


Ens Balu
5
S Rayavaram
2021-08-30 13:13:22

ఎస్.రాయవరం మండలం, సైతారుపేట గ్రామంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వ బ్రాంది షాప్ తమ గ్రామం లో ఏర్పాటు చేయవద్దంటూ  సర్పంచ్ రావి రమణబాబు ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. యలమంచిలి నుంచి యస్.రాయవరం వెళ్లే తయారు రోడ్డును లో ఉన్న తమ గ్రామ సెంటర్ లో బ్రాందిషాపు ఏర్పాటుకు అధికారులు ప్రయటించడం అన్యాయమన్నారు. ఈమేరకు సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ సెంటర్ లోనే ఆంజనేయ స్వామి, వినాయకుడి గుడి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నందున నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అటు యలమంచిలి వైపు గాని, ఎస్.రాయవరం వైపు గాని ప్రయాణం చేయడానికి బస్, ఆటో, ఇతర వాహనాల కోసం మహిళలు,  ఇతరులు వేచి ఉండే సెంటర్ లో ప్రజల సొమ్ము, ప్రాణాలను గుల్ల చేసే బ్రాంది షాపు ప్రారంభించం తగదన్నారు. దశల వారిగా మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తామని తెలిపిన ప్రస్తుత ప్రభుత్వమే బ్రాంది షాపులు పెంచి అమ్మకాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం చిగ్గు చేటని మహిళలు నినాదాలు చేశారు. గ్రామం మొత్తం తీర్మాణం చేసి ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కి పోస్టుద్వారా పంపినట్టు వారు మీడియాకి వరించారు. కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలు, స్థానిక యువత పాల్గొన్నారు. 
సిఫార్సు