గోదారోళ్లు ఏంచేసినా యరైటీగానే ఉంటది..


Ens Balu
6
Sankhavaram
2021-08-31 02:02:56

గోదారోళ్లు ఏం చేసినా కాస్త యరైటీగానే ఉంటుందనడానికి ఇదొక చిన్న నిదర్శనం. ఎప్పుడూ అందరిలో తాము కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు..సరిగ్గా శ్రీక్రిష్ణాష్టమి రోజున కూడా ఆ విధంగా వ్యవహరించారు. సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా, శంఖవరం మండల కేంద్రంలోని జన్మాష్టమి సందర్భంగా ఉట్టికొట్టిన వారికి కాజా బహుమతిగా ఇచ్చారు. అదేదో సాదారణంగా ఉందనుకుంటన్నారా..ఏకంగా ఐదుకేజీలు ఉంది..దానిని జాగ్రత్త పట్టుకోవాలంటే రెండు చేతులతోనూ మోయాల్సిందే.. శంఖవరం గ్రామంలో శ్రీక్రిష్ణ యాదవ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉట్టిపండుగ ఘనంగా నిర్వహించారు. అందులో గెలుపొందిన వ్యక్తి మొదటి బహుమతి కింద 5కేజీల కాజా.. రెండవ బహుమతి కింద 3 కేజీల కాజాను బహుమతిగా ఇచ్చారు. ఈ కాజాలను గ్రామానికే చెందిన మిఠాయిల తయారీ దారుడు ఎల్.వెంకటరమణ తన వంతు బహుమతిగా వీటిని అందజేశారు.  ప్రస్తుతం ఈ కాజాల సైజులు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే హల్ చల్ చేస్తున్నాయి..

సిఫార్సు