రౌతులపూడిలో1242 హెక్టార్లలో వరినాట్లు..


Ens Balu
3
Rowthulapudi
2021-08-31 07:43:31

రౌతులపూడి మండలంలో 1242 హెక్టార్లలో ఇప్పటి వరకూ వరినాట్లు జరిగినట్టు వ్యవసా యాధికారి పడాల గాంధీ తెలియజేశారు. మంగళవారం రౌతులపూడి వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2021-2022 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో వరి పంట నాట్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు. మండలంలోని 26 పంచాయతీలు, గ్రామ సచివాలయాల పరిధిలో వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల నమోదు కూడా జరుగుతుందన్నారు. అదే సమయంలో నాట్టు పూర్తయిన తరువాత వారి ద్వారా సస్యరక్షణ చర్యలకు సంబంధించి సూచనలు, సలహాలు కూడా రైతులకు అందిస్తామని ఆయన వివరించారు. వ్యవసాయ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా, గ్రామసచివాలయాల పరిధిలోని రైతుభరోసా కేంద్రాల్లోని తమ సిబ్బందిని సంప్రదించవచ్చునని వ్యవసాయాధికారి చెప్పారు.

సిఫార్సు