శంఖవరం పీహెచ్సీలో 78ఆర్టీపీసీఆర్ టెస్టులు..


Ens Balu
3
Sankhavaram
2021-08-31 07:53:10

శంఖవరం పీహెచ్సీ పరిధిలో నిత్యం కరోనా టెస్టులు చేస్తున్నట్టు వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం శంఖవరం పీహెచ్సీలో మీడియాతో మాట్లాడారు. గత మూడు రోజుల నుంచి 78 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నందున ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే పీహెచ్సీకి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. గ్రామసచివాలయాల పరిధిలో ఏఎన్ఎంలను కూడా ఈ పరీక్షల విషయంలో సమాచారం కోసం సంప్రదించవచ్చునని డాక్టర్ వివరించారు. ప్రభుత్వం అందించే ఈ ఉచిత సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సిఫార్సు