అన్నవరంలో రెండ్రోజులు 104 మెకిల్ క్యాంపులు..
Ens Balu
4
Annavaram
2021-08-31 10:07:17
అన్నవరంలో సెప్టెంబరు 1నుంచి 2వరకూ 104 మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు డాక్టర్ ఎస్ఎస్.రాజీవ్ కుమార్ తెలియజేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడారు. 1వ తేదిన అన్నవరం గ్రామసచివాలయం-2, 2న గ్రామసచివాలయం-3లోనూ ఈ మెడికల్ క్యాంపులు జరుగుతాయన్నారు. ఈ సమాచారాన్ని ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్ల ద్వారా వారి పరిధిలోని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసే ఈ మెడికల్ క్యాంపుల ద్వారా వైద్యసహాయంతోపాటు, మందులు కూడా ఉచితంగానే స్వీకరించవచ్చునన్నారు. ఈ మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరుతున్నారు.