సెప్టెంబరు 1 నుంచి పౌష్టికాహార మాసోత్సవాలు..


Ens Balu
3
శంఖవరం
2021-08-31 14:34:33

సెప్టెంబరు 1 నుంచి నెల రోజుల పాటు పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరుణశ్రీ తెలియజేశారు. మంగళవారం ఆమె శంఖవరం ఐసిడిఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీ స్త్రీల సౌకర్యార్ధం ఐసిడిఎస్ ద్వారా ఎంతో విలువైన పౌష్టికాహారం అందిస్తుందని, అంతేకాకుండా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు వస్తాయి..ఏఏ ఆహారాలలో పోషకాలు ఉంటాయనే విషయాన్ని ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ కార్యక్రమం శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. అన్ని కేంద్రాల్లో ఉత్సవాలు జరుగుతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, కళాంజలి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు