18నిండిన అందరికీ కోవిడ్ వేక్సిన్ వేయించాలి..
Ens Balu
4
Kathipudi
2021-09-01 10:41:14
కత్తిపూడిలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ కోవిడ్ వేక్సిన్ తప్పక అందించాలని, అదేవిధంగా మొదటి డోసు తీసుకొని 85 రోజులు పూర్తయిన వారికి రెండవ డోసు వెంటనే వేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు వైద్యసిబ్బందిని ఆదేశించారు. బుధవారం కత్తిపూడిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్డ్ వేవ్ ని ద్రుష్టిలో ఉంచుకొని వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది, గ్రామసచివాలయాల సిబ్బంది సంయుక్తంగా వారి పరిధిలోని అందరికీ కోవిడ్ వేక్సిన్ అందించాలన్నారు. అదేవిధంగా కోవిడ్ కేంద్రం వద్ద ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రతీకే కోవిడ్ వేక్సిన్ కేంద్రం వద్ద పంచాయతీ సిబ్బంది పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయించడంతోపాటు, చుట్టూ బ్లీచింగ్ చల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం లు పాల్గొన్నారు.