కర్మాగార కార్మికులకూ కోవిడ్ వేక్సిన్..


Ens Balu
4
Jarugumalli
2021-09-01 11:04:10

థర్డ్ వేవ్ కోవిడ్ నుంచి తప్పించుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలు కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని ఎస్సీకార్పోరేషన్ ఈడి తూతిక విశ్వనాధ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని జరుగుమిలి గ్రామపంచాయతీలోని మున్నంగి సీ ఫుడ్స్ కర్మాగారంలో 140 దినసరి కూలీలకు ఆయన దగ్గరుండి కోవిడ్ వేక్సిన్ వేయించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అన్ని వర్గాల వారికి, ముఖ్యం సంచార కూలీలకు కోవిడ్ టీకాలు వేయించాలని ప్రత్యేకంగా సూచించిందని, అలాంటి వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా కోవిడ్ వేక్సినేషన్ క్యాంపులు పెట్టి టీకాలు వేస్తున్నట్టు ఆయన చెప్పారు. స్థానిక పీహెచ్సీ డా.శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో కార్మికులందరికీ కోవిడ్ టీకా వేసినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సీఫుడ్ డైరెక్టర్ జివిరామారావు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు